తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Saturday, August 30, 2014

ఆముక్తమాల్యద పునఃప్రారంభం....

గత ఏడాది కాలంగా కొత్త టపాలు రాయకపోవడం వెనక సమయాభావం, పని వత్తిడి తప్ప వేరే ఏమీ లేదు. ఈ బ్లాగును మరిచిపోయింది లేదు. కాని అతి త్వరలో ఈ బ్లాగు మళ్లీ ప్రారంభమవుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము..

గతం లో యమునాచార్యుడు వాదంలో నెగ్గడమూ...పందెము నిబంధనలకు అనుగుణంగా ఆ రాజు తన రాజ్యంలో కొంత భాగముతో ఆ యమునాచార్యుని రాజును చేసి తన చెల్లినిచ్చి పెళ్ళి చేయడమూ తెలుసుకొన్నాం. అలాగే.. ఆ యమునాచార్యుడు దివ్యాస్త్ర మహిమ కలవాడై, దిగ్విజయము చేసి సర్వరాజులను జయించి రాజ్య భోగములందు, సామాన్యలోహములను బంగారము చేయుటమందు లోలుడయి ఉంటాడు. ఆరోజులలో ఒకనాడు.. శ్రీరామమిశ్రుడు రాజదర్శనము చేసుకుని రాజా! మీ పూర్వులు ఓ నిక్షేపమును కావేరినది యొక్క ఒకానొక ద్వీపమున ఉంచారు దాని చుట్టూ పాము ఉంటుంది. పద్మము శంఖము కూడా వుంటాయి అని చెప్పగా...రామమిశ్రుని వెంట శ్రీరంగం వెళ్ళి, పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తాడు. అప్పుడు రామమిశ్రుడు, మీ పెద్దలు కూడబెట్టిన నిధి యిదే స్వీకరించు, అని ఆ రంగపతి దివ్య శ్రీచరణారవిందాలను చూపిస్తాడు. ఈ కధ ఇంతవరకూ గత టపాల్లో తెలుసుకున్నాము.


మధ్యలో అనేక కారణాలతో జాప్యం జరిగింది. క్షమించెదరు గాక. ఆ తర్వాత.


యమునాచార్యునికి తాను చేసిన మహాపరాధం తెలిసి జ్ఞానము కలిగింది. తను ఏమిటి? ఈ రాజ్యపాలన ఏమిటి? యమునా చార్యుని పితామహుడు నాథముని. ఆయన గొప్ప భక్తుడు. ఆయన శిష్యుడు పుండరీకాక్షుడు గొప్ప భక్తుడు. ఆయన శిష్యుడు శ్రీరామమిశ్రుడు.  విషయాలను గ్రహించి.. వెంటనే శ్రీరామ మిశ్రునిచే పంచసంస్కారములు గావించుకొని..వెంటనే కొడుకుకు రాజ్యాన్ని వప్పగించి తాను సన్యాసము తీసుకుంటాడు. ఆ తరువాత కొడుకుకు రాజనీతి నంతా కూలంకషంగా బోధించాడు యమునాచార్యుడు.. శ్రీ కృష్ణదేవరాయలు చక్రవర్తి.. అయన రాజనీతి ఎంత చక్కగా ఉందో.. ఎంత జనరంజకంగా ప్రజలను పరిపాలించాడో తెలుసు. రాజ నీతి కత్తిమీద సాము వంటిది. అరివీరభయంకరుడు..కార్యసాధకుడు.. సాహితీవేత్త..సాహితీ ప్రియుడు.. అన్నింటికీ మించి తెలుగు భాషాభిమాని. శతృవులను నిలువరించడం..అవసరమైతే దునుమాడడం, అసమాన రాజనీతి ప్రదర్శించి శభాష్ అనిపించుకోవడం ఆయనకే చెల్లింది. ఆర్య చాణక్యుడైన కౌటిల్యుని అర్ధశాస్త్రానికి దీటైన రాజ నీతియని పలువురు ప్రశంసించడం గమనార్హం. అలాంటి రాయల రాజనీతిని గూర్చి తెల్సుకొవడము అత్యంత ఆకర్షణీయంగా ఆసక్తి దాయకంగా ఉంటుంది...అవిషయాలన్నీ...రాబోయే టపాలో తెలుసుకుందాము.

0 comments:

Related Posts Plugin for WordPress, Blogger...